WavesOfHeart

A Lover's Pen

సాయం సంధ్య తో నా పయనం మొదలైంది
సాగర తీరాన్ని తాకుతు గులక రాల్లను అనుసరించి
ఈ రెండు కనులలో దాగిన కథ
కన్నీటి ధారల వలె జారి, జాలి ని కోరుకుంది.

నిన్ను చుసేందుకె ఈ ఊపిరి ఉన్నది
నీ పెదవుల మధురిమ కోసమే, నమ్ము ప్రియ

చీకటి సూర్యుని దాచే సమయాన మొదలై
తెలవారే ఘడియ వరకు ఈ కల ఊపిరి పీల్చుకుంతుంది

తారకల వలె నాపై నీ చిరునవ్వుని వెదజల్లుతావు
నా హ్రుదయం లో గాయము వలె ఈ జ్యాపకం నిలిచిపోతుంది

నీ చూపు నన్ను శాపము వలె ఆవరించింది.

నా హ్రుదయాన్ని తీసుకుపొయావు, జాగ్రత్తగా దచిపెట్టు
ప్రతి ఉదయం నా పయనం మొదలవుతుంది ఈ పవనము తో. . .

నా ప్రియమైన కల కోసం, ఈ నిరీక్షన ఆగేంతవరకు.

You may like these posts too . . .