WavesOfHeart

A Lover's Pen

ఓ మనిషీ!
గడచిన ఈ జీవితం, మరపురాని పీడకల.
నిలిచిన నీ బాట, కానరాని చావుకల.

అనురాగం నీ ఊపిరితీస్తే,
ఆనందం అలసిపోతుంది.
ఆత్మీయం నీకు ప్రాణంపోస్తే,
అభిమానం పల్లవిస్తుంది.
గడచిన ఈ జీవితం, మరపురాని పీడకల.

జగం మరచిన మనుషుల మధ్య
జనం కోసం తపిస్తావ్ ఎoదుకోయ్?
నీకోసం కన్నీరు కార్చే వాళ్ళు,
ఏనాడో కనుమరుగైనారోయ్!

ప్రేమను పంచే స్నేహం,
ఆ ప్రేమకే బలి కానుంది .
తాపావేశాల తుఫానులో చిక్కుకుపోతోంది.
ఒడ్డును చేర్చే నావ, నీటి ఒడిలో సోలసిపోతోంది.
గడచిన ఈ జీవితం, మరపురాని పీడకల.

చావు పుట్టుకలు విశ్రాంతి లేని ఈ
జగన్నాటకం లో బలిపశువులవుతున్నాయి.
నీవు చచ్చి కోతకోశావ్,
నేను పుట్టి ప్రాణం పోస్తా. . .

You may like these posts too . . .